హిందూ ధర్మ రక్షకుడు ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమం తన తోటి హిందువులను అంధకారం నుండి వెలుగులోకి తీసుకురావడం. ప్రస్తుతం ప్రతి వ్యక్తి కూడా అజ్ఞానంతో దరిద్రానికి గురవుతున్నారు. . అజ్ఞానంతో దరిద్రాన్ని కొనితెచ్చుకొని అతడు బాధపడుతున్నాడు. ఒక నేరస్థుడు నాకు చట్టం తెలియదు అని చెప్పినంత మాత్రాన ఆ చట్టము వాడిని క్షమించదు. అలాగే ఏమీ తెలియని పసిపిల్లవాడు నిప్పును తాకితే చెయ్యి కాలుతుంది…. అంతేకానీ అయ్యో తెలియక తాకిండు కదా అని నిప్పు వాడిని వదిలిపెట్టదు. మన ప్రజలకు ప్రభుత్వ నియమాలు ఉన్నట్లుగానే అతి కఠోరమైన నియమాలు ప్రకృతి మనకి పెడుతుంది. వాటి గురించి తెలియకపోయినాను ఆ నియమాలు మనపై పనిచేస్తూనే ఉంటాయి. అజ్ఞానంతో మనము ఏదైనా తప్పు చేస్తే దాని ఫలం అనుభవించి తీరాల్సిందే. నియమాలు అనేది ప్రభుత్వా నియమం అయిన కావచ్చు లేదా ప్రకృతి నియమము అయినా కావచ్చు అది ఉల్లంఘిస్తే శిక్ష మాత్రం తప్పదు.
ఇలాంటి వాటి నుండి మానవుడని దుక్కాలకు దారిద్రానికి గురి అవ్వకుండా చూసుకోవడమే మన ధర్మరక్షకుడి కర్తవ్యం. కావున ప్రతి కరుంగళీ మాలకు ఎన్నో నియమాలు ఉంటాయి ఆ నియమాలు అన్ని పాటిస్తేనే మనకు అనుకున్న ఫలితం జరుగుతుంది. అంతేకానీ కరుంగళి మాల కొనేసి మెడలో వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే లేని దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అర్థం. మన హిందూ ధర్మం ప్రకారం ఆధ్యాత్మికంగా ఇలాంటి మాల ధరించాలన్నా కూడా దానికి మంత్రబలం మరియు గురు బలం ఉండాల్సిందే. అలా అని మా దగ్గరే మాల కొనాలని మేము అనట్లేదు. మాల కొనేముందు గురువుల సలహా తీసుకొని మరియు మంత్రం తెలుసుకొని కొనాలని మేము కోరుతున్నాము.